పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

సౌగంధిక ప్రసవాపహరణము

వాయు వేగంబున వాయుజుఁ డరిగె,
అనిలజుఁ డరిగిన నాఘటోత్కచుఁడు[1] 1315
మొనసేయ కున్నను, మోసం బటంచు
ధనబలంబులనెల్లఁ దగ వేఱు వేఱఁ
గొనఁగొని యష్టదిక్కుల బారు లేర్చి
నలుదిక్కులందు నెంతయు హెచ్చరికల
పొలుపొంద కోపురంబులు బెట్టి రమణి. 1320
నొకపొదరింటిలో నుంచి తా నొక్క
నికట దేశంబున నిలిచి కాపుండె
అంతట బాంచాలి ననిలజాఁ దలచి

ద్రౌపది - సంతాపము.


ఎంతయుఁ దల యూచి యిది చిత్ర మనుచు
మనమునఁ గడు ననుమానంబు బొడమి. 1325
తనలోనె తాను నెంతయుఁ జింత నొంది
జనపతి వల దని చాటిచెప్పినను

  1. భీముఁ డేఁగిన హిడింబీనందనుండు
    నేమరి యుండుట నిది మోస మనుచు (క)