పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

129

ఆడినమాట లేదనిన పాపంబు
పాడి దప్పుట రాజపంతంబుగాదు 1300
నిన్నుఁ బంపగవచ్చు, నీచేత నౌను;
నన్ను వేడినది యీనాళీకపాణి
యిదిగాక రణమున కరుగుటకంటె
నదనుమానము గాచు టది మిక్కుటంబు
నాసాటివాఁడవు, నాముద్దుపట్టి 1305
వాసికెక్కిన ధైర్యవరశౌర్యనిధివి
అచ్చెరుపడి మీర లందఱు బొగడ[1]
తెచ్చెద జాముకు దివ్యసూనములు
కనకాంబుజము గొని కలకంఠి దోడ్క
జననాథుఁ డున్న యాస్థలమున కరుగు 1310
మని దానవాధీశు నక్కునఁ జేర్చి
కనకాంగి నెంతయుఁ గౌఁగిట నలమి
పోయివచ్చెద నని భుజ మప్పళించి

  1. ఇచ్చట నీవుండు మే నేఁగి వేగఁ
    తెచ్చెద జాముల దివ్యసూనములు (త),