పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

సౌగంధిక ప్రసవాపహరణము

పట్టుదునో! దైత్యపతుల నెంతయును
చట్టలు చీల్తునో సర్వాధినాధు. 1285
ధట్టింతునో! చతుర్దశ భువనముల
నట్టిట్టు చేతునో! యంబుధు లెల్ల
బెట్టుగావింతునో! భీకరఫ్రౌఢి
కురుబలంబులనెల్ల కూల్తునో! లేక
వరబల్మిపట్టి తేవలయునో! యిటకు 1290
నని బల్కునందను నక్కునఁ జేర్చి
తనరు వేడుక నృకోదరుఁ డిట్టు లనియె

ద్రౌపదియొద్ద భీముఁడు ఘటోత్కచు నునిచి సౌగంధికముల కరుగుట.


ఓవీర శేఖర! యోదైత్యనాథ!
ఓవిశ్వభీకర! యోయికుమార!
వనవిహారమునకు వచ్చు నవ్వేళ 1295
వనజలోచనకు నేవర మిచ్చినాఁడ
పోఁడిమి నిటువంటి భూరిపద్మములు
వేఁడుచు నున్నది