పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

సౌగంధిక ప్రసవాపహరణము

నముదగ్ర శత్రుసంచయసమవర్తి
ఘనబలోద్దండ విక్రమకళాస్ఫూర్తి
తనతనూభవు ఘటోత్కజుఁ దలంచుటయు 1250
దలఁచినయంత నుద్దండ ప్రచండ
బలశౌర్యనిధి హిడింబానందనుండు
అటట్టు త్రిజగంబు లల్లలనాడ
చెట్టుగా ప్రస్థానభేరివేయించి
గగనచుంబి ప్రచండ గండ భేరుండ 1255
ధగధగద్ధగితకేతనధాళధళ్య
నానాయుధోజ్జ్వలనవరత్న ఖచిత
భూసుతదశచక్ర భూరిషట్కోటి
మహనీయఘంటికామార్తాండ సదృశ
బహుళకాంచనకుంభ భాసుర ప్రకట 1260
పంచాననవ్యాఘ్ర భల్లూకశరభ
సంచయభయదోగ్ర చర్మ సంకలిత
వితతమనోనేగవిధజవనాశ్వ
శతపరిభ్రాజితస్యందనం బెక్కి
యరదములో నలుబదియాఱుకోట్లమర 1265