పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

117

సమ్మతి గాని విచారంబు లనక
కోరుట కొదువలౌఁ గోరినయట్టి
కోరిక లీకున్న కొదువలో కొదువ
కటకటా సమయంబుగాని యీవేళ 1120
నిటువలె నడిగిన నేమనఁగలను
నిబి డాటవులయందు నిన్నుఁబోవిడిచి
యబల యేవిధమున నరుగుదు నేను
ప్రాణపర్యంతమౌ పనులయందైన
మానంబు పోకుండ మనవలె నండ్రు 1125
అటుబోవ నిట నెవ్వరై నను గలరె
యిట నున్న నటు సన నెవ్వ రున్నారు
ఇట నిల్తు నటఁ బోదు నేన యటన్న
పటుతరవిశ్వరూపంబును లేదు
తెగువ నిచ్చోటికిఁ దెప్పింతు నన్న 1130
మగువ యాకర్షణమంత్రంబు లేదు[1]


.

  1. రహిమీర నిచ్చటికి రప్పింతు ననిన
    మహిమ నాకర్షణమంత్రంబు నెఱుఁగ (త)