పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

113

ఘనదైన్యభయములఁ గలఁగుచున్నాఁడొ![1]
పోవలె పద మని పొసఁగఁ జేపట్టి
పావని మరలింపఁ బాంచాలి పలికె
సన్నుతాటోప! మీసంగడి రాఁగ 1060
నన్నియుఁ గనుఁగొంటి నభిలాషదీరె
కలకంఠ శుకముఖ్యకలకలధ్వనులు
విలసిల్ల వీనుల విందుగా వింటి
సురుచిరదివ్యప్రసూనవాసనలు
గరిమ ఘ్రాణింపఁ గలిగె నీవలన 1065
పరిపక్వమాధుర్యఫలవితానములు
పరువడి రుచిగొని భక్షింప గలిగె
సమ్మతి నొందితి చనుఁ డన నతఁడు

  1. కవ్వడి నిచటికి గలముచున్నాఁడొ
    యెవ్విధి నున్నాఁడొ యిందునిభాస్య
    అర్జునుం డిచటికి నరుదెంచెనేని
    దుర్జనుం డైనట్టి దుర్యోధనుండు
    ఏపనుల్ దలఁచునో యెఱుఁగరా దతని
    చేపట్ట గతజలసేతుబంధనము. (త)