పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

సౌగంధిక ప్రసవాపహరణము

పాంచాలపుత్రి నేర్పడఁజూచి పలికె
సలలితమృదుపాణి సైకతశ్రోణి 1045
తలిరాకుఁబోణి యోద్రౌపదీరమణి
తనరు వేడ్కల నెంత దవ్వు వచ్చితిమి
మనవివేకంబు నేమనవచ్చు నబల
తిలకించి పడమటిదిక్కు వీక్షింపు
నలినాక్షి ఘడియ యున్నది ప్రొద్దు గ్రుంక 1050

భీముఁడు ద్రౌపదితో ధర్మజుకడకుఁ బోదమని చెప్పుట


నీయహార్యస్ఫూర్తు లెల్లఁ జూచుటకు
వేయిగన్నులు గలవేలుపువశమె!
తడవిందు నిలిచిన ధర్మనందనుఁడు
బుడిబుడి యదటునఁ బొక్కి చింతించు[1]
నామీఁద నీమీఁద నరనాయకునకుఁ 1055
బ్రేమవాత్సల్యంబు బ్రియమును గలదు
ననుబాసి నినుబాసి నరనాథుఁ డెంత

  1. బుడి బుడి యడలును బొక్కిచింతించు (క)