పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

111

ఫలపల్లవోత్తాన పావనాసూన
లలితవనాసీన లావణ్యమాన 1030
మానితగాంధర్వమానిని గాన
మానస్వనాధీన మార్గఫణీన
తాండవలసమాన దాననిధాన
పాండురద్రుమవిటపస్థలోడ్డీన
కలకంఠముఖపతగవ్యాజమాన 1035
కలకలాకీర్ణలోకస్తూయమాన
సలలితశీతలచ్ఛాయాసమాన
విలసితం బగుకోన వేడ్కలింపూన
గని మెచ్చి మెచ్చి యాకామినీమణికి [1]
ఘనవినోదంబులు గనుపించె వేగ 1040
పశ్చిమభాగంబుఁ బరికించి చూచి

సూర్యాస్తమయ సమయము


యాశ్చర్యచిత్తుఁడై యనిలనందనుఁడు
అంచితాంబుజపాణి యలినీలవేణి

  1. గని మెచ్చి మెచ్చియాకాననంబునను (ట)