పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

సౌగంధిక ప్రసవాపహరణము

నలువు మీరిన లేఁతననలు గిల్లుచును[1]
సలలితసూనగుచ్ఛముల రువ్వుచును
పదరుచు కృష్ణసర్పములఁ దోలుచును 1015

కొదమసింగముల టెంకులకుఁ బాపుచును
చక్కనిఘనసారసైకతస్థలులఁ
ద్రొక్కుచు ననఁటుల తొలఁగ దొబ్బుచును
పొల్చు నిర్వులబిఱ్ఱుపొట్టలబిగువు
సీల్చుచు తాఁబేళ్ల చెదర నూకుచును 1020

నరుణాబ్జములు తమ్మిహంససంఘముల
నురికింపుచును మది నుల్లాస మొంది
పతికేలు వదలక పాంచాలపుత్రి
సతి నండఁబాయక జనవల్లభుండు
వింతస్థలంబుల వెదకి చూచుచును 1025

సంతోషచిత్తులై చన చన నెదుట
మనసిజపవమాన మాధవస్థాన
ఘనవాసనానూనకలితనవీన

  1. పొలపుమీరిన లేఁతసొనలు గిల్లుచును (1578)