పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

109

వనచరాధిపదైత్యవర్ణితం బగుచు
నొరసైన భారతయుద్ధంబుఁబోలె
గురుకర్ణభీష్మసంకులమును నగుచుఁ[1]
దనరారు గంధమాదనపర్వతంబు
చనవున కమలలోచనకుఁ జూపుచును 1000
పలుచనీహారసౌపానమార్గమునను
నెలమితో తిన్నగా నెక్కి పోవుచును
మదగజగమనమార్గంబునందుఁ
బొదలు తుమ్మెదలఁ జూపుచు వేగవేగ
మలయక మిట్టతామరలు ద్రుంపుచును 1005
విలసిల్లు సంపఁగెవిరులు రాల్చుచును
వెసచంద్రఫలకముల్ విఱిచి వైచుచును
అసమానబింబఫలాళి డుల్చుచును
కుందకోరకముల గుంజివేయుచును .
పొందైన చిలుకగుంపులను దోలుచును 1010
తెలివైన పోఁకబోదియలు గీటుచును
తొలఁగక జిగిఁదమితూండ్ల ద్రెంచుచును

  1. 4491 లో లేదు.