పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

సౌగంధిక ప్రసవాపహరణము

పటుసర్వమంగళాభ్యంచిత మగుచు 980
వారిజాసనుని నివాసంబుపోలె
నారదశారదానందంబు దగుచు
పురుహూతపట్టణంబును బోలి యెపుడు
నెరయు రంభాహారిణీయతం బగుచు[1]
పురుడింపఁగ నయోధ్యఁబోలె శ్రీరామ 985
భరతలక్ష్మణకళాబంధురం బగుచు
పొలుపొందు ద్వారకాపురమునుబోలె
బలభద్రహరిచక్రభాసురం బగుచు
కవిరాజుకల్పితకావ్యంబుఁబోలె
నవరసాలంకారనైపుణ్య మగుచు 990
సతతకవిస్తుతచందంబుఁబోలె
యతిగణవర్ణఫలాన్వితం బగుచు
రమణీయరత్నాకరంబునుబోలె
విమలాబ్జబహురత్నవిలసితం బగుచు
ఘనరామరావణకదనంబు బోలె[2] 995

  1. నెరయ రంభాప్సరోనిర్గతం బగుచు
  2. 4491 లో లేదు.