పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గంధవాహతనూజుఁ గనుఁగొని పలికె
నవనీశచూడు మల్లదె మిన్ను ముట్టి
వివిధభూరుహలతావితతులఁ బొదలి
కనకనానామణీకలితంబు నగుచు[1]915
కనిపించుచున్న నగంబు పేరేమి?
యని విన్నవించిన యలినీలవేణి
ననురాగమును జూచి యనిలజుం డనియె

గంధమాదనపర్వతవర్ణనము



తరలాక్షి గంధమాదన మనుపేరఁ
బరఁగిన శైల మీపర్వతమహిమ920
లెన్న శక్యంబె వాణీశునకైన
పన్నగేంద్రునకైన పల్లవపాణి
మందరగ్రామంబు మణికోటినగము
మందులగుబ్బలిమలయాచలంబు
హిమచలోచ్చయమును హేమభూధరము925

  1. కలిత నానామణీకలితంబు లగుచు
    విలసితంబుగ చాల వేడ్క రంజిల్ల (1578)