పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌగంధిక ప్రసవాపహరణము

95



లింపైన వాహిను లెన్నంగఁదగిన
కొలఁకులు నొరపైన కోన లెచ్చోట
గల వచ్చటికి వేగ గమనించవలయు
ఆనిన సంతోషించి యనిలనందనుఁడు
చనుమార్గములను గంజాతలోచనకు 755
గరుడకిన్నరయక్షఖచరగంధర్వ
వరసిద్ధసాధ్య నివాసభూములను
వనములు నదులు పర్వతనికాయములు
ఘనమైన పొదరిండ్ల కలితంబులయిన[1]
మహిత వస్తువులు వేయారు దెల్పుచును 760
విహిత సంభ్రమముల విహరించుచుండ
పొసఁగ నాకట నొచ్చి బొరియలు సొచ్చి
బుసగొట్టుచును నేఁగు భుజగ సంఘముల
కొదకక, మెడలంటి గొరికి ఖండించి
బొదలు ముంగిసల చప్పుడు లాలకించి 765
యదరుచు కన్నంబులవి లీల వెడలి

  1. మునిజనాగణ్య తపోనివాసముల (ప )