పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

సౌగంధిక ప్రసవాపహరణము



ననుమీరివచ్చు నంతటిపనిగలదె
యిచ్చెద ననిపల్కి, యియ్యకయున్న
కచ్చుకపడి పాతకముబోవనీదు
ధరణి మెచ్చరు వీరధర్మంబుగాదు
యరమరసేయక యనుమానపడక
నడుగు మేవరమైన నడిగినకోర్కె.
లిడియెద ననిన నయ్యింతి యిట్లనియె
ప్రకటించి నీదువెంబడివచ్చునపుడె
సకలభాగ్యము లెల్ల సమకూడె నాకు
వేమాఱు నే విన్నవించిననైన[1]
నామాట చెల్లించు నాథుండ నీవు
మనుజేంద్ర యీవనమార్గంబునందు
ఘనమైనవస్తువుల్ ననుగొంటినేని
యప్పుడు మిమ్ము నే నడిగెదఁగాని
యిప్పటి కేమి మహీనాథచంద్ర[2] త్ర)
సొంపైన వనములు సొబగైన నగము

  1. నేమేమి నే విన్నవించిన నైన (ఆ)
  2. యొస్పైసరావుల కొనర వేంచేయు