పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము


తరుణి నేధర్మజు తమ్ముడఁ గాను
అన విని పాంచాలి యనిలనందనుని
గనుఁగొని యిట్లనె కటకటం బడుచు
నా జీవితేశ్వర నరనాథచంద్ర
రాజవంశాగ్రణిరణరంగ భీమ
మతిలేక నే ననుమాటకె యింత
ప్రతినసేయఁగ నీకు భావ్యమే నాథ
వనవిహారముజాలు వస్తువుల్జాలు
నిను వేఁడుటలు చాలు నీ యీవి చాలు
బెదరె యుల్లంబు వచ్చినయట్టిత్రోవ[1]
పదపద నికఁజాలు పదివేలువచ్చె
నన విని నవ్వి యయ్యనీలనందనుఁడు
నసబోణి వీక్షించి నలువొందఁ బలికె
శీతాంశువదనరాజీవదళాక్షి
నా తెంపు నా పెంపు నా భుజాబలము
గనియున్న దానవు గలఁగ నేమిటికి

  1. పదపడి ధర్మజ పదములకడకు (2421)

</poem>