పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

87



ధర్మరాజువిచారము నకులుని భీమునివెంటఁ బొమ్మనుట,

రమణీమణు లహోరాత్రు, లెల్లెడల
నిరవొంద జరియింతు రివ్వనభూమి
నెరయ నామదిలోన నెగులు బుట్టెడిని
యవనిపై సఖులపై నర్థంబుపైని
ఎవరికి నైన నభీష్టంబు గలదు. 630
నరయక్షకిన్నరనాగగంధర్వ
గరుడఖేచరసిద్ధకామినీమణుల[1]
సరకుసేయని మహాసౌందర్యశాలి
తరుణిమాత్రంబె యీద్రౌపదీరమణి
చంద్రనివాసంబు సతి నెమ్మొగంబు 635
చంద్రవిలాసంబు సఖియ లేనగవు.
కనకంబు నిరసించు కలికి మైమెఱుఁగు
కనకంబు నిరసించు కలకంఠినాస
కువలయానందంబు కొమ్మనేత్రములు
కువలయానందంబు కోమలిపిఱుఁదు 640

  1. గరుడఖేచరనిశాకరబింబముఖులు (ట , ప)