పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

సౌగంధిక ప్రసవాపహరణము


వెంటబెట్టుకరమ్ము వీరాగ్రగణ్య
అని సెలవిచ్చిన యధికమోదమున
పనుపడ ధర్మజుపదముల కెరఁగి
యతనిచే దీవన లంది ధౌమ్యునకు 615
హితభక్తిసంభ్రమం బెసఁగ నెంతయును
మ్రొక్కి యాశీర్వాదములు గాంచి యెలమి
గ్రక్కునఁ దమ్ములఁ గౌఁగిఁట జేర్చి
నిశ్చలవృత్తితో నెలఁతయుఁ దాను
పశ్చిమగమనుఁడై పరువడి వెడలె 620
సంతాపమును బొంది శమననందనుఁడు[1]
చింతించి నకులుని జేరఁగాఁ బిలిచి

 భీముఁడు ద్రౌపదితో వనమున కరుగుట

వనితాలలామంబు వాయునందనుఁడు
ఘనమైన ఘోరదుర్గములకుఁ జనిరి
ఆమరగంధర్వవిద్యాధరయక్ష 625

  1. శమననందనుఁ డంత సంతాపమంది.
      యమరేంద్ర సుతునితో ననియె నెంతయును (త)