పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

సౌగంధిక ప్రసవాపహరణము


బాహుభోగముల నున్న పాంచాలపుత్త్రి
గహనంబునందు సాంగత్యదోషమున
నలమటగుంద నేమనవచ్చు విధిని
పలుమరుదైవంబు పగవారి గూడె
నని తలయూఁచి హా! యని వెచ్చ నూర్చి 585
కనుఁగవ కలితాశ్రుకణములు నించి[1]

ధర్మరాజు ధౌమ్యాచార్యు నడుగుట

తెలియ ధౌమ్యాచార్యు దెస జూచుటయును
అలరి యా విప్రకులాగ్రణి పలికె

ధౌమ్యుఁడు ద్రౌపది నంపు మనుట

నిటువంటిపనుల కైయేటికి మీరు
అటునిటు జూచెద రవనీతలేంద్ర 590
నాకుఁ దోఁచినరీతి నయశాస్త్రయుక్తి ,
వాక్రుచ్చుచున్నాఁడ వనితతో నివుడు
కాననభూమికిఁ గదులుచున్నారు.
నానావిహారముల్ నడుపుచున్నారు

  1. ఘనముగా చింతించి కటకటా యనుచు (2421)