పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

సౌగంధిక ప్రసవాపహరణము



కడుభీతితోఁ దల్లికడుపుసొచ్చినను
కడపటవచ్చెడి కార్యంబులెల్ల 550
రాకపోనేరవు కానికార్యంబు
లెక్కడనున్నను నింతైనరావు[1]
వలనొప్ప నలచక్రవర్తి రాఘవులు
తలపోయలేరైరె దైవవశంబు
దప్పింప శక్యమే ధాతకునైన 555
నెప్పటి కప్పటి కేమేమిపనులో
యప్పటి కాపను లమరఁజేయంగ[2]
తప్పి వచ్చిన మీద దైవ మున్నాడు
ఆదిగాక మొనఁజూపి యాడితి రిపుడు
మదినుండి నీ పవమాననందనుఁడు 560
చలమున నెంతైన చట్రాతినార
వలచు నీపనులందు వలదన్న వినఁడు
అతివ సంపుట లెస్స యంపకయున్న
నతఁడు దోడ్కొనిపోవునది నిక్కువంబు

  1. లెక్కడనుండిన నెంతైన బోవు. (4191)
  2. యప్పటి కాపను లమరకపోవు . (1878)