పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

78

సౌగంధిక ప్రసవాపహరణము


హరిమధ్య! యిట్టిమహారణ్యమునను
కరమొప్ప శరభమృగంబులు గలవు
ఏమిగావలెవన్న యిచ్చెద నీకు
వామలోచన! యిట్టి వాంఛలు విడువు
అన విని పాంచాలి యర్జునుఁ జూచి
కనుఁగవ నశ్రువుల్గ్రమ్మ నిట్లనియె
అనఘచారిత్ర యోయమరేంద్రపుత్త్ర
యనువొంద మున్నెన్నఁడై నను మిమ్ము
కోరి యీగతి వేడకున్నదిగాదె
మారుతి మానవమాత్రుఁడే యకట
అడవిలో లేనిభయంబులు సెప్ప
తడబడి పెదవులు తడుపుచు నిట్లు
తెరగొప్ప నావాంఛఁ దీర్పక మీరు
పరిహసించఁగ నెంత పని ఇది నాథ
మందారకుసుమదామములు "నే కొల్ల
సందీప్తదేవభూషణము లేనొల్ల
రమణీయదివ్యాంబరములు నే నొల్ల
క్రమమొప్ప చందనగంధ మే నెల్ల