ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము
73
నిత్య పోడశ దాననిరతుఁ డైనట్టి
యనఘ చారిత్రుండు యమతనూభవుఁడు
తనరార తనకూర్మితమ్ముఁ డైనట్టి
భుజబలవిక్రమాద్భుతయశోధనుని 395
విజయుని వేట్క దీవించి పుత్తెంచి
నట్టి కార్యము నేటియరుణోదయంబు
దట్టించి పవననందనుడు కాంతార
మునకుఁ దాఁజని కందమూలఫలములు
గొనివత్తు నని వేగఁ గువలయనేత్రి 400
పతిహిత చారిత్రి పాంచాల పుత్రి
నతని కడ్డమువచ్చి యాగిపోనీక
గొనకొని తనుఁదోడుకొనిపొమ్మటంచు
వనజాక్షిచలపట్టు వదలదింతైన
నేమియు: దోఁచక నిపు డున్నవాఁడ 405
నాముద్దుతమ్ముఁడ నాకేశతనయ
కడఁకతో నీకమ్మ కన్నాక్షణంబె
వడిగ రమ్మని దూరి వ్రాసిన లేఖ"
తేటగాఁ జదివి పార్థివుడు వేగంబె