పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

72

సౌగంధిక ప్రసవాపహరణము


వాయుసూనునియాన వ్రాలౌటఁ దెలిసి
విహ్వలచిత్తుడై వివ్వచ్చుఁ డపుడు 375
సింహాసనము డిగి చేతులు మొగిచి
వరుస నస్త్రమునకు వలగొని మ్రొక్కి
కరమొప్ప తన రెండుకరములు నెత్తి
కమ్మ నమ్ముననంటఁ గట్టినయట్టి
కమ్మపై పాండవాగ్రణిముద్రఁ గాంచి 380
సిరిమించు నా లేఖ శిరసావహించి
గరిమెతో నిటలభాగంబునఁ జేర్చి
కనుఁగవనొత్తి వక్షంబున నలమి
పనుపడఁ గట్టిన బంధముల్ విడిచి
వినయంబుతో కమ్మ విప్పి వాసవుఁడు 385
వినుచుండ చదివె నావీరశేఖరుఁడు
"శ్రీమన్మహారాజశేఖరుం డఖిల
భూమండలాధీశ భూరిమాణిక్య
మహిత కిరీటశుభ ప్రభాజాల
విహిత పాదాబ్దుండు వీరపుంగవుఁడు 390
సత్యవ్రతాచారు సర్వజ్ఞమూర్తి