పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

64

సౌగంధిక ప్రసవాపహరణమునీకు నే వెఱచుట నిక్క మొక్కటియె
కాక భయంబు నే కలనైన నెఱుఁగ!
కురురాజు నొకపెద్దకొండఁగాఁ జేసి
పరువడి మొనఁజూపి పల్కితి రిపుడు240
అతనికిఁ దోడుగా నమరగంధర్వ
పతు లేఁగుదెంచిన బర్వు లెత్తింతు
ననుఁ జూచి యిపుడె యీనలినాక్షి ననుపుఁ
డన విని ధర్మజుఁ డనిలజుఁ జూచి
ఓభీమ! కల దింక నొకసంశయంబు245

ధర్మరాజు సంశయించుట

ఈభీతహరిణాక్షి యీనీలవేణి
నిఁగ నేమి యనవచ్చు నిటువలెఁ గోరె
సొగసినట్లనరాదు సులభంబు గాదు
బహుయక్షరాక్షసభయద మీవనము
విహితంబు గా దిది వీరాగ్రగణ్య!250
యదిగాక నీవైన నర్జునుండైన
పదపడి నన్నుఁ గాపాడకయున్న