పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

63


లతిధైర్యబలవిక్రమాటోపులయిన
పతు లేవురును గల్గి పడుపాటు లెల్ల225
జితపడ ననుభవించితి నని పల్కి
యనిలతనూజుని యాననాబ్జంబు
గనుఁగొన నాతఁ డగ్రజున కిట్లనియె

భీముఁడు ద్రౌపది నంపుమనుటనరనాథ! మీ యనుజ్ఞలు గల్గెనేని
ధరణిపై నా కసాధ్యములును గలవె230
నను నీవు పేదమానవునిగఁ జూచి
యనిలనందనుఁ డొంటి యని పల్కఁదగునె
సాటికి నెక్కు నిశ్శంకరాయనికి
కోటముత్తిక లన గూడునే యెందు [1]
తిలకించి చూడు రాతికి గిలిగింత235
గలిగిన నాకళ్కు గలుగుభూపాల [2]

  1. కోటముత్తికె లన గూడునా యెందు (క )
    కోటముట్టడి యనఁగూడునా యెందు (త)
  2. గలుగునే లోకంబులోన భూపాల (చ)