Jump to content

పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

సౌగంధిక ప్రసవాపహరణము


చారుసువస్త్రభూషణములు విడిచి
పొలుపొందనిష్టోపభోగము లుడిగి
నలుకునఁ జెందుట, నన్నుంచి కాదె!210

అనఘాత్మ! నిన్ను నే ననఁబని లేదు
తనరార బ్రహ్మవ్రాతకుఁ దప్పురాదు [1]
మాయయ్య ద్రుపదభూమండలేశ్వరుఁడు
పాయనిప్రేమల పగలును రేలు
దాదులరొమ్ములఁ దనరారునట్టి215

దూదిపానుపులయందు బెనిచి యెపుడు
యేకోర్కెఁ గోరిన నేవేళనైన
కైకాన్కగా దెచ్చి కరుణతో నిచ్చు
పలుమారు మీపాలఁబడినది మొదలు
నలమటకొదువలే దది మీకె తెలుసు220

నొకనాయకుని నమ్మి యుండినసతికి
సకలకోరిక లెల్ల సమకూర్చు నతఁడు
అతులితాటోపు లత్యంతప్రతాపు

  1. లేదు (2421)