Jump to content

పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

సౌగంధిక ప్రసవాపహరణము


అనిలనందనుఁ డొంటి నరుగుచుండఁగను
చనియెదనన నీకు సమ్మత మగునె?
సరసీరుహానన సఖియల కోర్కె
లరసి చూచిన నెంతకై ననువచ్చు
కామినిచే టెఱుఁగనికూన వగుట
యేమియు దలపోయ నిది నీతి గాదు
కసిబోయి తిరిగెడు కావడిబరువు [1]
వసుధపై మోసేటివారికె తెలుసు
కడనున్నవారికిఁ గానఁగా రాదు
పుడమిలో పయనమై పోయెడివారి
నరికట్టఁగాఁ జెల్లదరుగునీవేఁగ
సరసంబు లిక చాలు చాలు ర మ్మనిన
అండజయాన రోషాశ్రువు లొలుక
పాండవేయాగ్రణి భాషించి పలికె

ద్రౌపది నిష్టురోక్తు లాడుట

నరవరోత్తమ నీవు ననుదూరవచ్చు

  1. కాశికిబోయిన కావడిబరువు (ట)
    కసిబోక తిరిగెడు కావటిబరువు (క)