పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

59


తక్కినవనముల తరుల తావితతు
లిక్కడి కన్నను యెక్కువ లేమొ!
అక్కడివనభూము లావినోదములు
మక్కువతోఁ జూచి మరలివచ్చెదను
యనుపతుల్చెప్పక నవును కాదనక [1]165
నెనరున తలఁపు[2] మన్నించగావలయు
నని వేడుకొన్నట్టియంభోజముఃఖని
గనుఁగొని పాండవాగ్రజుఁ డిట్టు లనియె
వనజాక్షి యిటువంటి వాంఛలు గోర
జనునె నీమదిలో విచారించి చూడు 170

 ధర్మరాజు వలదనుట

మనకు రారాజుకు మాననిపగలు
ఘనముగా నేవేళ గలిగియుండగను
అదిగాక యీనిబిడారణ్యభూమి
మదదానవేంద్రులు మలయుచుండఁగను

  1. ఆనుమతు ల్చెప్పక నవును కాదనక (చ)
  2. నెలవు (378)