పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

58

సౌగంధిక ప్రసవాపహరణముదుష్ట దానవకోటి ద్రుంచివై చుచును 145
శిష్టరక్షణమును జేయుచుండగను
జెన్నొంద నొకనాడు చెలఁగుచు భీముఁ
డన్నకు మ్రొక్కి ధౌమ్యాదుల కెరఁగి
తమ్ముల ద్రుపదనందన నాదరించి
నెమ్మి నానాయుధనికరము ల్పూని 150
మందస్మితంబున మసలక వేగ
కందమూలఫలార్థగమనుఁ డౌనపుడు

ద్రౌపది భీమునితోఁ గూడ వనవిహారము సేయఁగోరుట

ధరణీతల శ్రోణి ద్రౌపదీరమణి
ఆరసి దిగ్గన లేచి యని లనందనుని
దారి కడ్డముగచ్చి ధర్మజుఁ జూచి 155
నేరుపుతో మ్రొక్కి నిలిచి యి ట్లనియె
అనఘాత్మ ! నేఁడు నీయనిలజు వెంట
వనవిహారముసల్ప వాంఛ బుట్టెడిని
యీచెంత నున్న మహీరుహాపళులు
పూచి రాచి ఫలించి పొదలుచున్నవియు