పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

57



ఘలుమల్లు రని తాళగతులచే మొరయు 130
పనుపడి సుపరతి బంధ వైఖరుల
ననయంబు క్రీడించు యక్ష కామినుల
నలసత వెడలింప నతులమోదమున
మలయుచు విహారించు మందవాతములు [1]
మను జేంద్ర ! మరి పెక్కు మహిమల నలరి 135
చనుదెంచె నపుడు వసంతకాలంబు

భీముఁడు కందమూలముల దేఁ బూనుట

ఆసమయంబున నాయరణ్యమున
భాసిల్లు వేడ్కల బాండవాగ్రజుఁడు
తమ్ములు హితులు బాంధవులు గొల్వఁగను
నెమ్మితో ద్రౌపది నెయ్యంబు నెరప 140
పొలుపొంద ధౌమ్యాదిభూసురావళులు
చెలువంబుగను సుఖాసీనులై యుండి
ననురాగమునఁ జేర నరిగి యేవేళ
మునులు భూతభవిష్యములు దెల్పుచుండ
 

  1. వాయువుల (త)