Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


ఉ. శిష్టులఁగూడి మంతనముఁ ♦ జేసి, పరాకిసుమంతలేక సం
    తుష్టినిబొంది యంత తమ ♦ తోయమువారికిఁజెప్పి పుత్రకా
    మేష్టినొనర్చి బిడ్డలను ♦ నెట్టులొ కాంచెదనంచుఁ గార్య సం
    సృష్టమనంబునన్ బలికి ♦ చెచ్చెరదీక్షితుఁడై పునీతుఁడై . 358

ఉ. హోతలు ఋక్కులం జదువు ♦ చుండఁగ మిక్కిలి శ్రద్ధతోడను
    ద్గాతలు సామవేదమును ♦ గానముసేయ మనోహరంబుగా
    బ్రాతిగ యాజ్ఞికుల్ సకల ♦ వస్తువులన్ సమకూర్చుచుండఁ బ్ర
    ఖ్యాతిగ యజ్ఞగుండ సము ♦ ఖంబున భూమిపుఁడుండి దేవితో. 359

గీ. సమిధలనువేసి యజ్ఞ గుం ♦ డమున మివుల
    నాజ్యమునుబోసి యగ్ని చ ♦ ల్లారకుండ
    వ్రేల్చుచుండెను ద్రుపద పృ ♦ ధ్వీవరుండు
    భార్యతోఁబాటు పరవశ ♦ త్వమునఁజేసి. 360

గీ. యజ్ఞ ధూమంబు దిశలెల్ల ♦ నావరింప
    యజ్ఞగుండంబు మంటతో ♦ నావళింపఁ
    జెవులు చిల్లులుపడుచుండఁ ♦ జెప్పఁదొడగి
    రఖిలమంత్రంబు లొప్పుగా ♦ నచటిమునులు. 361

కం. ముగిసీ ముగియకమునుపే
     బగబగ నవనాగ్ని యన్ని ♦ వైపులఁ బర్వెన్
     సెగచే మొగములు మొగిడెన్
     బొగచేఁ బ్రజ కన్నుదోయి ♦ మూతలుపడియెన్. 362

82