ద్వితీయాశ్వాసము
బనవదు పూర్వకాల పరి ♦ భావము నీఁగుసుమా ! ప్రబోధముం
గని యెనరేఁగి ద్రావిడులుఁ ♦ గాంచెదరర్హ పదంబుఁజెప్పితిన్. 325
ఉ. సేతువుఁదొట్టి వింధ్యగిరి ♦ సీమలదాఁక వసించు ద్రావిడ
వ్రాతము కన్ను విప్పి యొక ♦ పారి కనుంగొని యాత్మదుస్థితిన్
దీతువుపిట్టవోలె నిగ ♦ దించెడి జాల్ముల త్రుళ్ళువాపి రుం
ద్రాతత పూర్వవైభవ స ♦ మన్వితులై యురళింతు రెంతయున్. 326
గీ. జూఁకఁ బదిబదారేండ్లుగ ♦ డాకమున్న
నూత్నభావోదయముగల్గి ♦ నూతన ప్ర
బోధమునుగల్గి ద్రావిడుల్ ♦ పూర్ణ గౌర
వంబుఁ బొందఁగలరు నిక్కు ♦ వంబుగాఁగ. 327
-♦ అసురులవలన ♦-
వ. అని వచియించి, సూతమహర్షి నాచే నర్థింపఁబడి యవలి కథా ప్రపంచమును వినిపింప సమారంభించి. 328
చం. అసురులు ప్రాణగొడ్డమగు ♦ నాకటి చిచ్చునకోర్వలేక నీ
రసపడి యెట్టకేని పర ♦ రాష్ట్ర పరంపరఁజూచి ప్రోచికో
నసువులఁ బశ్చిమాభిముఖు ♦ లై చని కాననసీమలందు దు
ర్వ్యసనములందుఁ జిక్కక ప్ర ♦ వాసముఁజేసిరి సంతసంబుతో. 329
గీ. కాయకష్టంబులకునోర్చి ♦ గహనభూమి
శరభ సింహశార్దూలాది ♦ జంతువితతిఁ
జంపి వాసయోగ్యంబుగా ♦ నవదరించి
కాపురంబుండిరచట సౌ ♦ ఖ్యంబుతోడ. 330
75