Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


గీ. భేదభావంబు లీరీతి ♦ విస్తరించి
    యార్యకింకరు లధిక గ ♦ ర్వాఢ్యులగుచు
    మచ్చరంబంతకంతకుఁ ♦ బెచ్చుపెరుఁగ
    నుద్దవిడి వేరుశాఖయై ♦ యుండి పిదప. 320

గీ. ద్రావిడ ప్రజావళియెల్లఁ ♦ దమకుఁ గైవ
    శంబు కాకపోయెనను క్రో ♦ ధంబుచేతఁ
    గలియుగంబునఁ బరికింపఁ ♦ గలవు రెండె
    వర్ణములటంచు నార్యులు ♦ నిర్ణయించి. 321

గీ. బ్రాహ్మణులును శూద్రులును మా ♦ త్రంబెకలరు
    క్షత్రియులు వైశ్యులును లేరు ♦ కలియుగమ్ము
    నందు నంచు సిద్దాంత వా ♦ క్యములువ్రాసి
    పెట్టిపోయిరి స్మృతులు ద్రా ♦ విడులకొఱకు. 322

కం. మాయావాదము నిల్వదు
     మాయావుల మంత్రతంత్ర ♦ మహిమంబిదిగో !
     పాయఁగఁజొచ్చెను మాయో
     పాయము లెన్నటికినైన ♦ బయలంబడవే? 323

గీ. స్మృతులనుచు మఱియుఁ బురాణ ♦ వితతియనుచు
    ముక్తినీఁజాలు గ్రంథ స ♦ మూహమనుచుఁ
    గల్లకపటం బెఱుంగని ♦ నల్లవారు
    నెమ్మనమ్ముల గట్టిగా ♦ నమ్మి చెడిరి. 324

చం. వినుము కుమార! నీకు విని ♦ పించెద సర్వము భావిసంగతుల్
      కనుకనిచేత నింకఁ జిర ♦ కాలము ద్రావిడభూమి యీగతిన్

74