Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


    సంశయింపంగ మీకేల ♦ సత్యమిదిగొ !
    చచ్చిపోయినపిదప మో ♦ క్షంబువచ్చు. 314

గీ. జుంటితేనె పూఁదేనియల్ ♦ జుఱ్ఱమాని
    జుఱ్ఱుఁడీ మీరు కడుపాఱ ♦ సోమరసము
    నప్సరః కామినీ మథు ♦ రాధరమ్ముఁ
    బానమునుజేయు యోగ్యత ♦ పట్టఁగలదు. 315

ఉ. అబ్బురపాటు పాటిలఁగ ♦ నందఱు నీగతివేడబంబుతో
    నిబ్బరమైన పట్టుదల ♦ నెక్కొన నచ్చఁగఁజెప్పి మైకమున్
    బ్రబ్బఁగఁజేసి ద్రావిడుల ♦ వంచనఁజేయుచు నార్యకింకరుల్
    దబ్బరలాడియాడి తమ ♦ దారికిఁ ద్రిప్పిరి కొంతమందినిన్. 316


వ. పిమ్మట నార్యకింకరు లుపజాపకులై పులుమరించి నిక్కి నీల్గుచు విఱ్ఱవీగుచుఁ గ్రిందుమీదెఱుంగక, స్వజాతిని ధిఃకరించి, స్వజాతీయుల మూఢులని తలపోయసాఁగి క్రమక్రమంబుగా. 317


గీ. మాతృ భాషాభిమానంబు ♦ మఱచిపోయి
    యన్యభాషయనెడి బైసి ♦ యైనలేక
    సంస్కృతంబును శ్రద్ధగాఁ ♦ జదువసాఁగి
    యీసడించివై చిరి సొంత ♦ బాస నకట ! 318

కం. ప్రాచీనాచారములు స
     మీచీనముగాదటంచు ♦ మిక్కిలి కినుకన్
     వాచాలత్వముతోఁ బూ
     ర్వాచారంబులఁ ద్యజించి ♦ రార్యానుచరుల్. 319

73