Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


గీ. శాత్రవానీకమీరీతి ♦ సమసిపోవ
    దుర్భరావగ్రహ విపత్తి ♦ తొలఁగిపోవఁ
    బ్రజలు బ్రదికిరి తస్కర ♦ భయములేక
    తెలుఁగు దొరలేలు మాగాని ♦ పొలములందు. 295

గీ. వర్తమానంబుననుఁగూడఁ ♦ గీర్తిధనులు
    వెల్గుచున్నారు పైవారు ♦ తెల్గు దేశ
    మందుఁ బెట్టి పోషించెడు ♦ నట్టిశక్తి
    నంగరంగ వైభవముల ♦ నంగవించి. 296

గీ. ఒక్కగతి పులి మేకయు ♦ నొక్కఱేవు
    నందు నీరుఁ ద్రావెడునట్టు ♦ లధికశక్తి
    న్యాయభావంబుతో దక్షి ♦ ణాపధంబు
    నెల్ల ద్రావిడరాజన్యు ♦ లేలుచుండ. 297

గీ. ఉత్తరంబున నార్యులు ♦ ద్వృత్తినపుడు
    చతురుపాయంబులఁ బ్రయోగ ♦ చతురులగుచు
    శత్రుకాండీరులనునెల్ల ♦ నదమదించి
    దక్షిణాపథమ్ము జయింపఁ ♦ దలఁచి తలఁచి. 298

గీ. సర్వతంత్ర స్వతంత్రుండు ♦ శ్రద్ధదానుఁ
    డింగితజ్ఞుండు వేద వే ♦ దాంగవేది
    యగు నగస్త్యుని బిలిపించి ♦ యప్పుడపుడే
    చెప్పిరిటు పల్కు నయగార ♦ మొప్పుచుండ. 299

ఉ. తెక్కలి నిన్న మొన్న పర ♦ దేశమునుండి బిరానవచ్చి నా
     మెక్కడఁజూచినన్ రిపుల ♦ దే పనిగా మనచుట్టు మూగి తా

68