Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


    జోక్యముకల్గనీక గుణ ♦ శోభితులై నయపక్షపాతికిన్
    శక్యముకాని యట్టిపని ♦ సంభవమౌనె జగత్త్రయంబునన్. 291

గీ. వారు కాలగోచరులైరి ♦ వారిపిదప
    దేశ మల్లకల్లోలమై ♦ దిక్కు లేమిఁ
    గాఱుచీకట్లు దిశలెల్లఁ ♦ గ్రమ్మికొనఁగఁ
    బ్రజలు కళవళించిరుపద్ర ♦ వములచేత. 292

గీ. తమిళ కేరళ తులువ రా ♦ ష్ట్రముల పూర్వ
    పుణ్య పరిపాకమునఁజేసి ♦ పోసరించి
    రచట నాయర్లు వెళ్ళాలు ♦ నతులశౌర్య
    విదితకీర్తి భాసితులైన ♦ మొదలియార్లు. 293

గీ. తెలుఁగు దేశంబునందు దే ♦ దీప్యమాన
    శక్తి రాజ్యంబుఁజేసిరి ♦ సారభుజులు
    వెలమ మన్నీలు రెడ్డి హం ♦ వీరవరులు
    కాపు సరదార్లు నాయకుల్ ♦ కమ్మదొరలు. 294

సీ. విక్రమావష్టంభ ♦ విభవాతిరేకులై
               విదళించి కొట్టిరి ♦ వెలమదొరలు
    సమర శౌర్యాటోప ♦ చండ ప్రచండులై
               క్రవ్వించి నెట్టిరి ♦ కమ్మదొరలు
    నిర్ణిద్రదోస్సార ♦ నిర్భిన్న వైరులై
               రెట్టించిమెట్టిరి ♦ రెడ్డిదొరలు
    వైరి భీకర ఖడ్గ ♦ పాండితీదక్షులై
               కదియించి దట్టిరి ♦ కాపుదొరలు

67