సూతపురాణము.
నీడనిచ్చుచునున్నవి ♦ నేఁడుకూడ
"వనము తోఁటలు” దక్షిణా ♦ పథమునందు. 287
ఉ. కాలవశంబునన్ ద్రవిడ ♦ ఖండము సర్వము ఛిన్న భిన్నమై
వ్రీలిన భిన్న రాష్ట్రములు ♦ భిన్న కులంబులు నుద్భవించెఁ ద
న్మూలమునన్ బురాతన స ♦ మున్నతి కోల్పడిపోయి పిమ్మటన్
జాలఁ గృశించెఁ గందువడె ♦ శాత్రవులుం దలలెత్త వెండియున్. 288
గీ. అబ్బురపు కాలవైపరీ ♦ త్యంబుచేత
రాష్ట్రములు చీలిపోయిన ♦ రాజులెల్లఁ
జెదరి నలుదిక్కులకు నేగి ♦ చిన్న చిన్న
సీమలార్జించి దొరలైరి ♦ సేఁగిలేక. 289
వ. దేశకాల పాత్రంబులవలనఁ గల్గిన పెక్కు మార్పులచే నాయా సీమలకు నేగిన ద్రావిడులు, నూతనాచారంబులు పట్టువడుటచే భిన్న నామరూపంబులందాల్చి విజృంభించి, పదంపడి దక్షిణాపధమును మరల దక్కోలుఁజేసికొని, వివిధ రాజవంశంబులపేరిట, నిష్కంటకంబుగా మహావైభవముతోఁ బరిపాలించిరి. కాలానురూపంబునఁ గల్గిన యీ పరిణామదశను నానుపూర్వికగ వర్ణించుట సుకరంబుగాదయినను, నా నేర్చిన కొలఁది పెద్దలవలన యెఱింగిన కొలఁది యెఱింగింతు నాలింపుము. ద్రావిడులు విజ్జోడై తమిళులు, తెలుఁగులు, కన్నడులు, మలయాళులు మొదలగు జాతులుగఁ జీలి, దక్షిణాపధంబు నాల్గు చెఱగుల నాక్త్రమించి, వెవ్వేరు నాగరికతయు భాషయుఁ బ్రతిభయుఁగలుగఁ గట్టుమాఱఁ జిరకాలం బరిష్టంబులేకుండ నేలుచుండ. 290
ఉ. ఐక్యముతోడఁ బంచజను ♦ లందఱు హాయిగనుండఁ జోళ చా
లుక్యముఖాది భూమిపతు ♦ లున్ భువినేలిరి కొంతకాలమే
66