Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


    ధ్వీరమణుండు పాండ్యుఁడతి ♦ ధీరుఁడు ద్రావిడభూమి భర్త శూ
    రారికులంబునెల్లఁ దెగ ♦ టార్పఁడె ధర్మజ పక్షపాతియై. 282

సీ. వింధ్యదక్షిణభాగ ♦ విశ్వంభరను నొక్క
               గొడుగుక్రిందికిఁదెచ్చి ♦ విడచినారు
    కాకిచేఁ గబురంపి ♦ కప్పముల్ దెప్పించి
               కొని వైరి కభయంబుఁ ♦ గూర్చినారు
    దానధర్మశ్రేణి ♦ యూనంబుగాకుండ
               బండారముల వెల్తి ♦ పఱచినారు
    దండెత్తివచ్చిన ♦ మండలేశులనెల్లఁ
               బూరిమేసెడిదాఁకఁ ♦ బొడిచినారు

గీ. సరిగఁ బాలించి దుష్ట శి ♦ క్షణము శిష్ట
    రక్షణముఁజేసిరి ప్రజాను ♦ రంజకముగ
    రాజమాత్రులే ద్రావిడ ♦ ప్రభువులెల్ల
    నిఖిలలోకైక కల్యాణ ♦ నిలయులైరి. 283

సీ. క్రమముగా వంశ పా ♦ రంపర్యముగవచ్చు
               నాచారములను గా ♦ పాడినారు
    ఉత్పన్నదశఁబొంద ♦ కుండ నెల్లప్పుడు
               శృంగారకళలఁ బో ♦ షించినారు
    కాటకంబులనెల్ల ♦ బూటకంబులుచేసి
               సీమలన్నింటి ర ♦ క్షించినారు
    దొంగదొద్దడికాండ్రఁ ♦ దూలించి రాష్ట్రంబు
               లెద్దడిలేకుండ ♦ దిద్దినారు

64