Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


మ. కొమరుంబ్రాయపు కండకావరమునన్ ♦ గోవాండ్రు దుర్ధర్షులై
     భ్రమచే ద్రావిడకన్యకానివహ లా ♦ వణ్యంబునంజొక్కి డం
     బముతోడన్ జెఱపట్టినన్ స్మృతులహో! ♦ పల్లెత్తుమాటైన ధ
     ర్మముకాదంచును జెప్ప నేరవుకదా ! ♦ మర్యాదబద్ధంబులై. 268

ఉ. ఎల్లర దొడ్ల పెంట భుజి ♦ యించెడి జంతువులెన్నియేని న
     ట్టిల్లునుజొచ్చుచున్న నెవ ♦ రేమనరార్యులు, కాని జంకుతో
     మెల్లఁగ ద్రావిడుల్ గడప ♦ మెట్టినమాత్ర కషాయతాక్షులై
     గొల్లునఁ దిట్టిపోసెదరు ♦ కూడదటంచు వచించు నేస్మృతుల్ ? 269

సీ. కోయ నయితికాని ♦ తీయ మామిడిపండ్లఁ
               జేతికందిచ్చెడి ♦ చెట్లనడుమ
    జడివానకైనను ♦ దడియకుండఁగనుంచు
               ముండ్లుగల్గని పొద ♦ రిండ్లనడుమ
    మోరలుపై కెత్తి ♦ పుల్లావుపెయ్యలు
               క్రేళ్ళువారెడి పచ్చి ♦ బీళ్ళనడుమ
    ఎండకారుననైన ♦ నెండిపోవని తేట
               కొండవ్రంతలకొండ ♦ కోననడుమ

గీ. విరులక్రొందావిఁ జిల్కు ప ♦ య్యెరలుగ్రోలఁ
    బాఱుటాకులపాక లే ♦ ర్పఱచికొనుచుఁ
    నందుఁ దలదాఁచికొను ద్రావి ♦ డాళినెల్ల
    వానరులటంచు నార్యులు ♦ వదరినారు. 270

గీ. గడుసు రాయబారములెట్లు ♦ నడపఁగలరు?
    కడలి కానకట్టలనెట్లు ♦ కట్టఁగలరు ?

61