Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


    సంతోషముతోఁ దెగఁబడి
    యెంతెంతలుచేసినార ♦ లేమివచింతున్ ? 262

ఉ. ఈవగఁ గుత్సితాత్ములయి ♦ యెంతయు ద్రావిడ మానసంబునున్
    నోవఁగఁజేసి యార్యులు మ ♦ నోరథసిద్ధిని బొంద లేక తా
    మేవగనేని తంత్రము వ ♦ హించుచు వారల స్థూల దేహముల్
    బోవఁగఁజేయఁగా మనసు ♦ పుట్టినఁ బట్టనిగట్టి కిన్కతో. 263

ఉ. ఆర్యనవోఢలంగొని య ♦ నార్యులు పెండిలియాడ వర్ణ సాం
    కర్యముకల్గి యున్నతి గ ♦ కావికలౌనని దూరదృష్టి చే
    నార్యసభాపతుల్ స్మృతుల ♦ యందున వ్రాసిరి ద్రావిడాళి త
    త్కార్యమొనర్చినన్ గఠిన ♦ దండనలం బొరిపుత్తుమంచొగిన్. 264

ఉ. ఒక్కయధర్మమున్ సలుప ♦ కుండఁ బరార్తిని గోరకుండఁ గొం
    డొక్కవిధంబునన్ జెమట ♦ యోడ్చి ధనంబును గూడఁబెట్ట నా
    ఱొక్కము ద్రావిడప్రజకు ♦ మ్రుచ్చిలియో బలవంతపెట్టియో
    దక్కకయుండఁజేయుటయె ♦ ధర్మమటంచు వచించి రార్యులున్. 265

ఉ. అంగద చిచ్చునార్చుకొన ♦ నైన ననార్యులు పట్టెఁడేనియున్
    బొంగలి ముట్టఁగూడ దొక ♦ పూటయుఁ జక్కని బట్టకట్ట రా
    దెంగిలికూడు సాపడియె ♦ యెప్పుడు తప్పకవెట్టిఁ జేయుచున్;
    గింగిరిపాతఁ గట్టుకొని ♦ కిట్టుటె ధర్మమటందురార్యులున్. 266

ఉ. జాత్యభిమాన దుర్విషయ ♦ సక్త మనంబునఁ గ్రూరకర్ములై
    సత్యము ధర్మమున్ వదలి ♦శత్రులరాయుటె కర్జమంచుఁ బా
    తిత్యము మూటఁగట్టికొని ♦ త్రిక్కక యార్యులు మంత్రత్రంత్రదౌ
    ర్గత్యనిమగ్నులై తలప ♦ రానివి కానివిచేసి రెన్నియో! 267

60