సూతపురాణము.
ఉ. పంబిన కోపవేగమున ♦ వైరుల యుక్కడగింప తీవ్ర రో
షంబున బారు టీటెలును ♦ జౌకులు కత్తికటారి పిండు వి
ల్లంబులుదాల్చి యొక్క మొగి ♦ నందఱు మచ్చరమూని సింహనా
దంబులుచేయుచున్ సమర ♦ ధాత్రికిఁ జేరఁగ గుంపు గుంపులై. 221
గీ. వింటికోపుమీఁద ♦ వీరరక్తముఁజల్లి
పలుకవాలునకును ♦ బలులువెట్టి
మూఁగదేవరలకు ♦ మ్రొక్కుబడులుదీర్చి
పైనమైరి రిపుల ♦ బారిసమర. 222
కం. అంతకుమున్నే రిపు వృ
త్తాంతమెఱిఁగి యార్యులు బహు ♦ దర్పముతో ని
శ్చింతమెయిన్ సాయుధులై
పంతముతో వచ్చినారు ♦ బవరము సేయన్. 223
కం. ఒంటరులై సరిసరులై
బంటులు చెలరేఁగి యుభయ ♦ పక్షములందున్
గెంటింపఁబడుచు గెంటుచు
బంటింపక వారనేక ♦ భంగులఁ బోరన్. 224
ఉ. గండరగండలై పిఱికి ♦ కండ యొకించుకలేక చండదో
ర్దండగదాప్రహారముల ♦ దండు పయింబడి పోరుచుండఁగా
నేండులు పూండులున్ గడచె ♦ నింతియకాని జయంబుమాత్రమున్
రెండుకుదుళ్ళవారిని వ ♦ రింపకపోయె నిఁకేమిచెప్పెదన్ . 225
గీ. అంత భటులెల్ల జర్జరి ♦ తాంగులగుచుఁ
గాందిశీకులై తాత్కాలి ♦ కంబుగాఁగ
52