Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


కం. దేశము మనయదికాదో !
     దేశోద్ధరణంబు భాగ ♦ ధేయము కాదో !!
     దేశవినాశకులగు వై
     దేశిక హననంబు మన య ♦ దృష్టముకాదో !!! 212

సీ. అవిసితేనెలుచిల్కు ♦ నమృతకల్పములైన
               పండ్లనిచ్చెడి వృక్ష ♦ పంక్తిగల్గి
    తమయంతనే క్షీర ♦ ధారలు గురియించు
               పొదుగులుండిన యాల ♦ కదుపుగల్గి
    తావుల్ గుబుల్‌కొను ♦ పూవుదీవెల కప్ప
               డంబుల పొదరిండ్ల ♦ డంబుగల్గి
    తడిసి నాగెటికఱ్ఱు ♦ దాఁకకుండఁగఁ బండు
               బలముగల్గిన మంచి ♦ పొలముగల్గి

గీ. యెల్ల కాలంబు పోషించె ♦ నింతదనుక
    “నడుగనిదె యన్నమును బెట్ట ♦ దమ్మ”యైన
    ననెడి సామెత వ్యర్థమై ♦ దనఁగ నిట్టి
    మాతృదేశంబు మనమెట్టు ♦ మఱవవచ్చు ? 213

ఉ. కూళలురేఁగి యీకరణిఁ ♦ గూడని కార్యము లాచరించుచున్
    బాలలు బాలురున్ బెదరి ♦ పాఱఁగ బొబ్బలు పెట్టిపెట్టి గ
    గ్గోలొనరించి దేశమును ♦ గొద్దియో గొప్పయో యాక్రమింప నీ
    పోలిక నూరకుంట మన ♦ బోంట్లకు ధర్మమె? రాజకర్మమే? 214

గీ. నదురు బెదరులేని ♦ నాయంకులెందఱో
    సొంత నాడుకొఱకు ♦ వంతదక్కి

50