Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


గీ. మాంత్రికులు విప్రవరు లప్ర ♦ మత్తులగుచుఁ
    జెడని తంత్రంబుఁ జక్కగా ♦ నడపుచుండఁ
    జుట్టుప్రక్కల పొలమెల్లఁ ♦ జుట్టఁబెట్టి
    కైవశముఁ జేసికొనినారు ♦ క్షత్రవరులు. 207

కం. దేశంబీవిధముగ వై
     దేశిక వీరభటులకు న ♦ ధీనమయిన నా
     క్రోశముతోఁ బరికించి స్వ
     దేశజు లారాటపడుచు ♦ దికమకలగుచున్. 208

-♦ ద్రావిడయోథుల మంతనము ♦-



గీ. రచ్చమ్రానుక్రింద ♦ ద్రావిడమన్నీలు
    రెడ్డిగములు వైచి ♦ గడ్డుదేరి
    రెడ్డిగములఁ బిల్చి ♦ యొడ్డోలగంబుండి
    మాటలాడిరిట్లు ♦ మంతనమున. 209

కం. వింటిమె వింతలు ? నిజముగఁ
     గంటిమె యెపుడేని యిట్టి ♦ కార్యమ్ములఁ ? గూ
     ర్చుంటిమె చేతులు ముడుచుక ?
     బంటులమని ప్రల్లదీండ్రు ♦ పగ్గెలు కొట్టన్. 210

గీ. బొల్లిమొగముమీఁదను నిల్వు ♦ బొట్టుఁబెట్టి
    రాలురప్పల కెల్లను ♦ గేలుమోడ్చి
    గంద్రగోళంబుఁగావించు ♦ కల్లరీండ్ర
    దౌష్ట్యమును మాన్పకుండుట ♦ ధర్మువగునె? 211

49