Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


    ర్ణత్రయముగ విభజించుచు
    సూత్రించిరి ధర్మకోటి ♦ సూరులదయచే. 203

సీ. నిత్యనైమిత్తిక ♦ నియమంబులనుదీర్చి
               భగవంతుఁ బూజింప ♦ బ్రాహ్మణులను
    ఖడ్గధారలచేతఁ ♦ గంపకోటలఁగట్టి
               కాపాడఁ బల్లెల ♦ క్షత్త్రియులను
    వాణిజ్య గోపరి ♦ పాలన కృషులచే
               బండారములనింప ♦ వైశ్యవరుల
    నియమించి వేర్వేఱ ♦ నిర్దిష్ట కార్యముల్
               జాగరూకతతో డ ♦ జరుపుచుండఁ

గీ. గూటియెద్దడిలేకుండఁ ♦ గొన్నినాళ్ళు
    సకల సౌభాగ్యగరిమచే ♦ సాఁగ “మూఁడు
    పూవు లారు కాయ"లనిన ♦ పోల్కినెగడెఁ
    జూచువారికి నొడలెల్ల ♦ సొక్కుపుట్ట. 204

గీ. బ్రాహ్మణుండు వేద ♦ పాఠంబుసేయంగ
    క్షత్రియుండు రిపులఁ ♦ జక్కఁబఱప
    వైశ్యవరుఁడు కృషియు ♦ వాణిజ్యమునుజేయ
    నార్యసమితి యెసగె ♦ ననుదినంబు. 205

గీ. పుట్టి పెరుగుచున్న ♦ బొట్టియలకునెల్ల
    నూత్న శౌర్యపటిమ ♦ నూరిపోసి
    కుబుసమూడ్చినట్టి ♦ కోడెత్రాచులఁజేసి
    పెంచినారు కులము ♦ పెద్ద లెల్ల . 206

48