Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


కం. చిరి తామర కొలనువలెన్
     బరిమితిలేకుండ వారు ♦ వర్ధిలుచుండన్
     సిరిసంపత్తులతోడన్
     బెఱవారికిఁ గన్నుఁగుట్టె ♦ బెడిదంబగుచున్. 200

సీ. గండాడుక్రోల్పులుల్ ♦ గండరించెడిచోట
               గోరాడు నేనుగుల్ ♦ గూడుచోట
    బుసకొట్టు నాగముల్ ♦ మసకలాడెడిచోలు
               గర్జిల్లు సింహముల్ ♦ కవియుచోట
    ఱంపిల్లి వృషభముల్ ♦ ఱంకె వై చెడిచోట
               మంపిల్లితోడేళ్ళు ♦ మరగుచోట
    కారుదున్నలుకూడి ♦ కసవుమేసెడిచోట
               కారుమబ్బులు తొంగి ♦ కలియుచోట

గీ. తిండికై వాల్మెకంబులు ♦ తిరుగుచోట
    వత్సములును బాలురును మ ♦ హోత్సవమునఁ
    బందెములువైచికొని క్రేళ్ళు ♦ వారుచుండ
    నూరువల్లెలు తలయెత్తై ♦ నొక్కటొకటి. 201

గీ. అంతకంతకు నీరీతి ♦ నార్యసమితి
    వర్ధిలఁ గులము పెద్దలు ♦ భావిగతులఁ
    బాయకట్టులఁ జర్చించి ♦ బందుకట్టి
    గట్టుదిట్టముల్ చేయుట ♦ కర్జమనుచు. 202

కం. పాత్రులను బిలిచి బ్రహ్మ
     క్షత్రియవైశ్యులని యార్య ♦ సంఘంబును వ

47