Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


    గలయఁ బరికింప మిఱుమిట్లు ♦ గొలుప నందె
    నెలవు లేర్పఱచికొనంగ ♦ నిశ్చయించి. 196

చం. పరమబుభుక్షచే నవసి ♦ భారతభూమిని జొచ్చి పిమ్మటన్
      సురలను తొంటిపేర్విడచి ♦ నూత్నసమాఖ్యను నార్యనామమున్
      బిరిగొనువేడ్కఁదాల్చి పిరి ♦ వీకును మాని క్రమక్రమంబుగా
      గురుతర కాయకష్టముల ♦ కుం దలలొగ్గుచుఁ గీర్తికాములై. 197

సీ. చిదుగు కంపలనెల్లఁ ♦ బొదుపుగా నొకచోటఁ
               బెచ్చుగాఁబెట్టి కా ♦ ర్చిచ్చుఁబెట్టి
    పొడవుగాఁ బెరిఁగిన ♦ నిడుదచెట్టులనెల్ల
               గొడ్డళ్ళచేఁ బడఁ ♦ గొట్టివైచి
    ఎండకన్నెఱుఁగక ♦ యివతళించెడునేల
               పై నున్న యీరముల్ ♦ పాయఁద్రోసి
    గుట్టమెట్టలుగాఁగ ♦ బిట్టుగాఁబడియున్న
               పలుగురాళ్ళన్నింటిఁ ♦ దొలఁగఁబుచ్చి

గీ. భరత భూమండలంబును ♦ వాసయోగ్య
    మైనదానిగా నొనరించి ♦ యచ్చటచట
    నార్యు లగ్రహారంబుల ♦ నవతరింపఁ
    జేయ సమకట్టి యద్భుతా ♦ మేయశక్తి. 198

గీ. జాంగలముల లాంగలములఁ ♦ జక్కఁజేసి
    యెక్కలిని మిక్కిలి వసించు ♦ నిక్కఁజేసి
    యార్యకౌమారవర్గంబు ♦ కార్యనిరతిఁ
    గాట్రగడ్డతోఁ బల్లెలఁ ♦ గట్టిరంత. 199

46