ద్వితీయాశ్వాసము
మున్నూట యర్వది ♦ ప్రొద్దుల ముఱిపించు
వెల్లాటకత్తెల ♦ వీడుటెట్లు?
మందయానలతోడ ♦ మందాకిని మునింగి
విహరించుకోర్కెల ♦ విడచుటెట్లు ?
గీ. పండువెన్నెలమాపులఁ ♦ బాయుటెట్లు ?
గండుకోయిల పాటల ♦ గడచుటెట్లు ?
అనుచుఁ గన్నీటిజాలుతో ♦ వెనుకతిరిగి
వ్రేలుకాడెడీ మోముతో ♦ వెడలనెంచి. 192
ఉ. మూటలుముల్లెలుం దలల ♦ మోపి భరంబునఁ దొట్రుపాటుతో
దోలుట దొడ్లనున్‌వదలి ♦ త్రొక్కిసలాడుచు నందఱేకమై
బాటలఁబట్టి పేరలపు ♦ వాయఁగఁ బాటలుచొక్కి పాడుచున్
బూఁటలు రోజులున్ నడచి ♦ పోయిరి కొండల నేటవాలుగా. 193
గీ. అమరనదిదాఁటి ముదిగొండ ♦ నవతరించి
కొందఱిటునటు పరికించి ♦ కొట్టకొనకు
భరతవర్షంబు వీక్షించి ♦ పట్టపవలె
మెట్టిరాంగిలేయులఁబోలెఁ ♦ బొట్టకొఱకు. 194
.
గీ. భరతవర్షంబుఁ జొరక య ♦ సురులయోని
జ ప్రముఖ దేవయోనులు ♦ క్షిప్రగతిని
పశ్చిమాశాభిముఖముగాఁ ♦ బైనమైరి
కొల్లగొట్టంగ దేశంబు ♦ కొల్లయనుచు. 195
గీ. సింధు గంగానదీపుణ్య ♦ జీవనములఁ
బూఁచికాచిన తరులతా ♦ పుంజములను
45