Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


    గమ్మతావుల గొజ్జంగి ♦ కాల్వదాటి
    నందనోద్యాన వనసీమ ♦ యందుఁజొచ్చి. 141

సీ. ఒకవంక వీక్షింప ♦నుత్ఫుల్ల సౌవర్ణ
               పంకజాత పరాగ ♦ పంకిలంబు
    ఒకచాయఁ గనుగొన్న ♦ శుకశారికానీక
               కోకిల కాకలీ ♦ కూజితంబు
    ఒకక్రేవఁ బొడగన్న ♦ వికచమందార పు
               ష్ప మరందగురు ఝరీ ♦ ప్లావితంబు
    ఒకకోనఁ బరికింప ♦ నురువేపథుఃగ్లాని
               సంహారకసమీర ♦ చాలితంబు

గీ. మథురవేణు వీణాగాన ♦ మండితంబు
    స్వైరకేళీ విహారిణీ ♦ సంకులంబు
    విలువిటీ నటీనటపరి ♦ వేష్టితంబు
    నందనోద్యాన మానంద ♦ మందిరంబు. 142

చం. తడవులనాఁటనుండియును ♦ దాపసవృత్తిని బూనియున్న నా
      కడవులె యాటపట్టులయి ♦ నందునఁ దస్మృగపక్షిజాతులం
      దుడుగని నేస్తముంగలిగి ♦ యుండుటచేతను సంభ్రమంబునన్
      వెడలితి నందనోపవన ♦ వీధులుచూడఁగ నాల్గుమూలలన్. 143


వ. అంతట నాగుబ్బుగాఁ బెఱిగిన పూఁబొదరిండ్లు, పూఁబొదరిండ్ల నుండి, పూఁదేనె దిగఁద్రావి మత్తిల్లి వెలువడు తేఁటిపౌఁజు, తేఁటిపౌఁజురొద కులికిపడు బిత్తరికన్నెలు, కన్నెల వెన్నాడు గోవాండ్రునుగల్గి నిత్యకల్యాణము, పచ్చతోరణమై వెలుంగుచుండ నేనిటునటు తిలకించుచుండ. 144

33