Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


కం. అను మాట లాలకించుచు
     ననిమిషగురుడంతఁ బల్కె ♦ నాత్రముతోడన్
     వినుమని శ్రద్ధాభక్తుల
     మనువు సమాలింపనుండె ♦ మక్కువతోడన్. 136

కం. కల్లారితనముఁ బూనకు
     మిల్లి దిగో ! దివ్యదృష్టి ♦ యిచ్చెద నీకున్
     మెల్లన భారతదేశం
     బెల్లన్ గనుగొమ్ము నిన్ను ♦ నేమను కొనుదో. 137


వ. నేనును భారతదేశకష్టగాథాప్రపంచమంతయు నెఱింగినవాఁడ నగుటచేతను, మనువు బృహస్పతి వాక్యంబులు పూర్వపక్షంబు సేయనేరక డిల్లపడియుండుటచేతను నటనుండ రోసి మగిడి వచ్చుచు స్వర్లోకంబు వీక్షింప బయలుదేర. 138


కం. హిమవాలుకాఝరీతతి
     సుమధూళీమిళిత లలిత ♦ శుభ్రామృతయై
     శమితాథ్వోరు శ్రమయై
     ప్రమదోద్యానంబునుండి ♦పాఱుచునుండెన్. 139

ఉ. ఆ సెలయేళ్ళ గట్టుకడ ♦ యంచుల వెంబడి సాగిపోవఁగా
     నాసవయోనులైన వివి ♦ ధాగమతండము జాగరూకులై
     కాసెలబిగ్గఁగట్టి మడిఁ ♦ గట్టుచు బాదులుత్రవ్వి నీరమున్
     దోసెలఁబోసి పెంచు పువు ♦ దోటలకాపరి మూఁకఁజూచితిన్. 140


–♦ నందనోద్యానము. ♦—


గీ. నందనముఁ జూచు కోర్కెలు ♦ సందడింపఁ
    బారిజాత పరిమళంబు ♦ దారిఁజూపఁ

32