Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


సీ. గరుడ గంధర్వ కి ♦ న్నర కిం పురుషముఖ్య
               నానాప్రధిత దేవ ♦ యోనివితతి
    జాత్యంతరులనేక ♦ శతవర్షములనుండి
               యిందొక్కచో వసి ♦ యింపలేదె ?
    పక్షపాత విశిష్ట ♦ శిక్షాస్మృతుల మేము
               రచియించినార మే ♦ క్రమముఁదప్పి?
    ఐకమత్యముతోడ ♦ నన్నదమ్ములరీతిఁ
               జరియింపలేదె పొ ♦ చ్చంబులేక

గీ. ప్రజలయం దెచ్చులొచ్చులు ♦ వర్దిలంగ
    స్మృతులు వ్రాయించు భూపతుల్ ♦ స్మృతులువ్రాయు
    పండితావళియున్న భూ ♦ మండలంబె
    యదుపులేనట్టి మ్లేచ్ఛ రా ♦ జ్యంబుసుమ్ము. 132

గీ. ప్రజల సమదృష్టితోఁజూచి ♦ రాష్ట్రమందు
    నీతిబాధలు లేకుండ ♦ నీతిగల్గి
    ప్రజలఁబ్రోచుట రాజధ ♦ ర్మంబు కాని
    పక్షపాతంబుఁ జూపింపఁ ♦ బాడియౌనె. 133


వ. ఈ సూటిపోటు మాటలకు మను వులికిపడి క్షణకాలంబాగి యీ విధంబుగాఁ జెప్పదొడంగె. 134 క్రమముఁదప్పి


ఉ. అప్రతిమాన బుద్ధి ధను ♦ లై స్మృతులం దలక్రిందుసేయు మా
    విప్రులు కొందఱట్టె పల ♦ వించి కడున్ బలవంతపెట్టఁగా
    నప్రతిభుండనై జడుఁడ ♦ నై స్మృతి వ్రాసితి నన్ క్షమింపుఁడీ
    క్షిప్రగతిన్ బ్రమాదపడి ♦ చేసినకార్యముగాన గీష్పతీ! 135

31