Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము.


    భరతవర్షమునందుఁ ♦ బ్రజలకు ధర్మైక్య
               పంచారమునుమాన్పఁ ♦ బాడియయ్య ?

గీ. ఆంధ్రులను మ్లేచ్ఛజాతుల ♦ యందుఁజేర్చి
    వ్రాసిపెట్టితివిదియేమి ♦ పాపమయ్య ?
    ఆంధ్రజాతి గూరిచి యెట్టి ♦ యానుపాను
    తెలియకుండంగ స్మృతి నేల ♦ పలికితయ్య. 127

గీ. వానవంగుళ్ళకోర్చి రేఁ ♦ బవలు ఱెప్ప
    వాల్ప కూడిగంబొనరించు ♦ ప్రాతలకును
    బ్రాత, యెంగిలి, పొల్లును ♦ బ్రతిఫలంబ
    టంచుఁ జెప్పితి విదియెట్టి ♦ న్యాయమయ్య ? 128

ఉ. భద్రముఁగూర్పఁగాఁ బ్రజకు ♦ వ్రాసితి నీస్మృతివందువయ్యయో!
    శూద్రునకున్ ధనంబమర ♦ క్షోభపడున్ జగమెల్లనంచు నే
    మాద్రిరచించితో!మనుజ♦మాత్రుఁడుకాఁడొకొశూద్రుఁడక్కటా!
    క్షుద్రుఁడవీవొ! లేక మరి♦శూద్రుఁడో! చెప్పుసురేంద్రుసన్నిధిన్. 129

కం. ఒక్కటి యడిగెదఁ జెప్పుమ
     యెక్కటి "శూద్రంతుకార ♦యేద్దాస్య "మటం
     చెక్కరణిన్ స్మృతివ్రాసితి
     వక్కటికము నీకు సుంత ♦యైనను గలదే ? 130

గీ. కటికవానికిఁ గల్గున ♦ క్కటికయైనఁ
    గానరాదు నీయెడల మ ♦ హానుభావ !
    ఋషివి యెట్లైతివేగతి ♦ స్మృతినివ్రాసి
    ధర్మనిర్ణయమ్మునుజేయఁ ♦ దగితివయ్య ? 131

30